తాజా వార్తలు

Thursday, 19 October 2017

నిండు కుండలా శ్రీశైలం జలాశయం

ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహాల కారణంగా శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు నాగార్జున సాగర్‌ డ్యామ్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 2.72లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 1,13,038 క్యూసెక్కులు ఉండగా.. 1,12,018 క్యూసెక్కులు ఔట్‌ఫ్లోగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.90 అడుగుల నీటిమట్టంతో నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 209 టీఎంసీల నీరు నిల్వ ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment