Writen by
vaartha visheshalu
08:48
-
0
Comments
ఎపి ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పేది నిజమే అయితే శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తప్పు చేస్తున్నారని అనుకోవాలి. తాను పార్టీ మారిన నేపద్యంలో అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశానని ఆదినారాయణరెడ్డి అన్నారని వార్త వచ్చింది.తన రాజీనామాను స్పీకర్ పెండింగ్లో పెట్టారని చెప్పారు. స్పీకర్ ఆమోదించకుంటే తామేమి చేయగలమని అన్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన రాజీనామాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేయటం తనకు సమస్యేనని ఒప్పుకున్న ఆది.. ఎన్నికలు అనవసరమని భావించటం వల్లే తన రాజీనామాను స్పీకర్ ఆమోదించటం లేదమోనన్నాయన.. నా రాజీనామాను ఆమోదించమని స్పీకర్ ను ఒత్తిడి చేయలేమని చెప్పలేం కదా? అంటూ తన మాటలతో స్పీకర్ కోడెలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేశారు మంత్రి ఆది. మరి.. మంత్రివర్యుల మాటలకు స్పీకర్ గారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
No comments
Post a Comment