తాజా వార్తలు

Saturday, 21 October 2017

‘నేను, నా భార్య’ చంద్రబాబు చెప్తేనే వింటాం..!

తెలంగాణ టీడీపీని వీడుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా.. రేవంత్ తో పాటుగా కొందరు నేతల పేర్లు కూడా బయటికివచ్చాయి.. అందులో ముక్యంగా మక్తల్ నియోజకవర్గం  మాజీ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్త కోట దయాకర్ రెడ్డి పేరు కూడా ఉండటంపై ఆయన స్పందించారు.. తాను టీడీపీని వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఒకవేళ ఆ లిస్ట్ లో తన పేరు ఉంటే నేను బాద్యుడిని కాదు అని దయాకర్ రెడ్డి స్పష్టం చేసారు.. ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే,, “నేను, నా భార్య”  చంద్రబాబును కలిసి నిర్ణయం తీసుకుంటామని అయన అన్నారు.. చంద్రబాబు చెబితేనే తాము ఏ నిర్ణయమైనా తీసుకుంటామని కూడా దయాకర్ రెడ్డి స్పష్టం చేసారు..!
« PREV
NEXT »

No comments

Post a Comment