తాజా వార్తలు

Thursday, 19 October 2017

రేవంత్ రెడ్డిపై మాట్లాడటానికి భయపడుతున్న ఏపీ టిడిపి నేతలు!

ఊహించినట్లుగానే తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ నేతలు భయపడుతున్నారు. రేవంత్‌ రెడ్డి విమర్శలపై నోరు విప్పాలంటేనే వారు వణికి పోతున్నారు. ఆయన సూటిగా లేవనెత్తిన అంశాలకు వారి దగ్గర సమాధానం లేకుండాపోయింది. ప్రస్తుతం ఆ పార్టీలో ఇదే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రేవంత్‌ విషయంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించడానికి వెనకడుగు వేశారు.

రేవంత్‌ రెడ్డి ఏపీ మంత్రులపై చేసిన ఆరోపణల విషయంలో ఎలా స్పందిస్తారని ప్రశ్నించిన మీడియాకు ఉమ సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. ఆయన చేస్తున్న విమర్శలపై సమాధానం దాట వేశారు. రేవంత్‌ విమర్శలను తమ పార్టీ అధిష్ఠానం చూసుకుంటుతుందని ఆయన తప్పించుకున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment