తాజా వార్తలు

Wednesday, 25 October 2017

లోకేష్ కి వైసీపీ వింత సవాల్!

చంద్రబాబునాయుడు వెన్నుపోటు, కుట్రదారుడని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు పెంచి పోషించిన పార్టీని, పదవీ బిక్ష పెట్టిన పార్టీని, పిల్లనిచ్చిన మామ పార్టీని వెన్నుపోటు పొడిచాడు కాబట్టే ఆదినారాయణ, అమర్నాథ్ రెడ్డి గ్యాంగ్ అంతా ఆయన పంచలో చేరిందని విమర్శించారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జోగి రమేష్ మాట్లాడారు.పాదయాత్రతో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వెళుతుంటే…టీడీపీ విమర్శలు చేయడం తగదన్నారు. లోకేష్ 420 అని మాట్లాడుతున్నాడని,  420 అనగానే గుర్తుకువచ్చేది మీ నాన్న చంద్రబాబునాయుడేనన్న విషయం తెలుసుకోవాలని  జోగి రమేష్ హితబోధ చేశారు. నిద్రపోయే పిల్లాడిని అడిగినా 420 ఎవరంటే చంద్రబాబు అని చెబుతారన్నారు.విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామరావు అని తప్పులు లేకుండా పలకలవా లోకేష్.. అంటూ జోగి రమేష్ ఎద్దేవా చేశారు. ఏబీసీడీలు కూడా రాని లోకేష్ జగన్‌ను విమర్శించడమా? అని మండిపడ్డారు. మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment