తాజా వార్తలు

Saturday, 21 October 2017

‘మ‌నం’ ముందుగా అనుకున్నది వారితోనట..

తెలుగు భాషతో పాటు తమిళ భాషా చిత్రాల్లో కూడా చాలా ఫేమస్ అయిన హీరో సిద్దార్థ్ కి విపరీతమైన క్రేజ్ ఉండేది ఒకప్పుడు. రెండు భాషల్లోనూ వరుస ప్లాప్ లు పడుతూ ఉండడం తో అతని క్రేజ్ అమాంతం తగ్గిపోయింది.హీరోగా ప్రేక్షకుల మదిలో ఎప్పుడో దూరం అయిపోయిన సిద్దార్థ్ ఒక ప్రయోగాత్మక నటుడుగా అందరికీ గుర్తుండే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా కొన్ని హారర్ తో పాటు అనేక చిత్రాలు షూటింగ్ లు జరుపుతున్నాడు సిద్దార్థ్. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మనం సినిమా గురించి చెప్పుకొచ్చాడు. ఈ కథ కోసం విక్రమ్ కుమార్ ముందుగా తననీ.. కె.విశ్వనాథ్ గారిని.. వెంకటేశ్ ను అనుకున్నారని చెప్పాడు. అయితే ఆ తరువాత ఆయన ఈ కథను అక్కినేని ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్లారని అన్నాడు. అందువలన ఈ సినిమాలో తాను చేయవలసిన పాత్రను మిస్సయ్యానని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా వచ్చిన చాలా సంవత్సరాల తరవాత హీరో సిద్దార్థ్ ప్రత్యేకంగా ఈ విషయం ఇంటర్వ్యూ లో నొక్కి మరీ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.
« PREV
NEXT »

No comments

Post a Comment