తాజా వార్తలు

Saturday, 21 October 2017

రేవంత్ కాంగ్రెస్ లోకి రావాలని నేనే కోరా: వీహెచ్

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న అంశంపై ఆ పార్టీ సీనియర్ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇంకొందరైతే పార్టీలోకి తీసుకున్నా.. అంత ప్రాధాన్యత ఇవ్వొద్దని కాంగ్రెస్ అధిష్టానానికి చెబుతున్నారు.
తాజాగా, కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వంలో పనిచేస్తానంటే ఎవరైనా పార్టీలోకి రావొచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరొచ్చిన స్వాగతిస్తుందని చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment