తాజా వార్తలు

Tuesday, 17 October 2017

హైదరాబాద్ శివార్లలో 5 మృతదేహాలు.. తీవ్ర కలకలం

హైదరాబాద్‌ ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద 5 మృతదేహాలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. శంకర్‌పల్లి(మం) ఇంద్రారెడ్డి నగర్‌  పరిధిలో చెట్ల పొదల్లో 3 మృతదేహాల్ని గుర్తించారు. వాటికి కొద్ది దూరంలోనే కారులో మరో 2 డెడ్‌బాడీలు ఉన్నాయి.ఒకే స్పాట్‌లో ముగ్గురి డెడ్‌బాడీలు పడి ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా చంపి అక్కడ పడేసి ఉంటారంటున్నారు స్థానికులు.ముగ్గురిలో ఇద్దరు యువతులు 20 ఏళ్లలోపు వయసున్నవారే. మరో మహిళ వయసు సుమారు 40 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారా లేక వేర్వేరు ఘటనలా అన్నది తేల్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు, సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా వీరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment