తాజా వార్తలు

Tuesday, 17 October 2017

జగన్ కు దూరమవడానికి కారణం చెప్పిన రేణుక!

ఇటీవల కర్నూలు జిల్లా నంద్యాల ఎన్నికల్లో పరాజయంతో నైరాశ్యంలో ఉన్నవైసీపీకి కర్నూలు ఎంపీ బుట్టా రేణుక గుడ్ బై చెప్పేశారు. దీనితో పార్టీ జిల్లాలో మరింత కుంగిపోయినట్లయింది. ఏపీ వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. కాగా టీడీపీకి కండువా కప్పుకున్న అనంతరం జగన్ కు దూరం కావడానికి గల కారణాలని బుట్టా రేణుక వివరించారు. తన నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించుకోవడం, ప్రజా సంక్షేమాన్ని మరో మెట్టు ఎక్కించడం కోసమే తెలుగుదేశం పార్టీలో చేరినట్టు బుట్టా రేణుక వెల్లడించారు. తన నిర్ణయం వెనుక పార్టీ ఫిరాయింపులు, ఎవరినో మోసం చేయడాలూ లేవని, టీడీపీలో చేరిన తరువాత ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ రేణుక వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని, ఆర్థికంగా ఎంతో వెనుకబడిన కర్నూలు జిల్లాలో అభివృద్ధికి చంద్రబాబు సహకరిస్తానని హామీ ఇచ్చారని అన్నారు.  వైఎస్ఆర్ సీపీని వీడటం వెనుక ఎటువంటి రాజకీయ కారణాలూ లేవని, తన కార్యకర్తల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment