తాజా వార్తలు

Wednesday, 25 October 2017

చక్కెర వల్ల కాన్సర్ గడ్డలు పెరిగే అవకాశం..

చక్కెర వల్ల డయబెటీస్ వస్తుందనే విషయం మనకు తెలిసిందే. అయితే, మధుమేహం లేకున్నా, క్యాన్సర్ ముప్పు ఉన్నవారికి కూడా చక్కెర డేంజరేనని పరిశోధనలు తెలుపుతున్నాయి. ‘నేచర్ కమ్యునికేషన్’లో ప్రచురించిన కథనం ప్రకారం.. చక్కెరలో క్యాన్సర్‌ కణాలను ఉత్తేజపరిచే ‘RAS’ అనే జీన్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. డచ్ యూనివర్శిటీతో గత 9 ఏళ్లుగా జరుపుతున్న పరిశోధనలో చక్కెర.. క్యాన్సర్ కణాలను పోషించేందుకు ఉపయోగపడుతుందని తేలింది. ఈ నేపథ్యంలో శరీరంలో దాగివుండే క్యాన్సర్ కణాలను ఉత్తేజపరిచి, త్వరగా విస్తరించేందుకు చక్కెర ఉపయోగపడుతుంది. కేయూ ల్యూవెన్‌కు చెందిన మాలిక్యులర్ బయోలజిస్ట్ ప్రొఫోసర్ జాన్ థెవెలైన్ మాట్లాడుతూ.. ‘‘చక్కర అతిగా తినడం వల్ల శరీరంలో క్యాన్సర్ పెంపొందించేందుకు దోహదం చేస్తోందని మా పరిశోధనల్లో తేలింది. ఇది ‘వార్‌బర్గ్’ బోలోపేతం కావడం వల్ల కాన్సర్ గెడ్డలు ఉత్తేజితం అవుతాయి’’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో చక్కెర, ఉప్పులను మితంగా తీసుకోవడమే ఉత్తమం. వీటిలో ఏది ఎక్కువైనా ఆరోగ్యానికి ముప్పే. ముఖ్యంగా వంశపారంపర్యంగా క్యాన్సర్, మధుమేహం రోగాల ముప్పు ఉన్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
« PREV
NEXT »

No comments

Post a Comment