తాజా వార్తలు

Tuesday, 17 October 2017

రెండు రోజులుగా ఢిల్లీలో రేవంత్ : కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని విశ్వసనీయ సమాచారం. గత రెండు రోజులుగా రేవంత్ ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంతో జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని చెబుతున్నారు. రేవంత్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వనున్నట్టు సమాచారం. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీసీ వర్గం నేతలకు అవకాశం లభించనుంది.ఇక టీపీసీసీ అధ్యక్షుడిగా దళితుడిని నియమించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా టీడీపీ పోరాటాలు చేయలేకపోతోందనే భావనతోనే కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయానికి రేవంత్ వచ్చినట్టు చెబుతున్నారు. 
అయితే ఈ వార్త‌లపై రేవంత్ రెడ్డి స్పందించి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను ఢిల్లీలో ఉన్న నేప‌థ్యంలో కాంగ్రెస్ పెద్ద‌ల‌తో స‌మావేశం అవుతున్నార‌ని వార్త‌లు అబద్దం అని రేవంత్ రెడ్డి మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చారు. తాను టీఆర్ఎస్ నేత‌ల‌పై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లాన‌ని చెప్పారు. టీఆర్ఎస్ ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన కూలి ప‌నులు, త‌ద్వారా వ‌చ్చిన డ‌బ్బును పార్టీ అవ‌స‌రాల‌కు ఉప‌యోగించిన విధానంపై అభ్యంత‌రాలు చెబుతూ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గ‌తంలో ఇదే విష‌య‌మై తెలంగాణ సీఎస్‌కు కూడా ఆయ‌న‌ ఫిర్యాదు చేశారు. కాసేప‌ట్లో ఆయ‌న ఇదే విష‌య‌మై కేంద్ర హోం శాఖకు కూడా ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.  
« PREV
NEXT »

No comments

Post a Comment