తాజా వార్తలు

Tuesday, 27 March 2018

ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా తార‌క్‌

బిగ్‌బాస్ ఈవెంట్ పుణ్యమా అని జూనియర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇన్నాళ్లు న‌టుడిగా స‌త్తా చాటిన తార‌క్ స్టార్ మా టీవీలో ప్ర‌సార‌మైన బిగ్‌బాస్ షోతో ఎక్క‌డికో వెళ్లిపోయాడు. ప్ర‌తి శ‌ని, ఆదివారాలు తార‌క్ కోసం తెలుగు ప్రేక్ష‌కులు టీవీల ముందు వాలిపోయేవారు. కేవలం వారాంతాలో్ల తార‌క్ వ‌స్తున్నాడ‌నే టీఆర్‌పీలు కూడా ఎక్కువ‌గా ఉండేవి. సినిమాలు, యాడ్లు కాకుండా తార‌క్ తొలిసారిగా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన ప్రోగ్రాం అది. తొలి ప్ర‌య‌త్నంలోనే సామాన్య ప్రేక్షకుడికి సైతం ఎన్‌టీఆర్ బాగా ద‌గ్గ‌రైపోయారు. త‌న మాట‌ల‌తో ఆక‌ట్టుకున్నారు. తాను ఉన్నంతసేపు తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఛానెల్ మార్చ‌నీయ‌కుండా అద్భుతంగా చేశారు. ఈ ప్రోగ్రాం ఎన్‌టీఆర్‌కు మ‌రో అరుద‌న అవ‌కాశాన్ని తీసుకొచ్చింది. ఈసారి స్పెషల్ ఏమిటంటే స్టార్ గ్రూఫ్ ఐపీఎల్ మ్యాచ్ లకు తెలుగు కామెంటరీ ప్లాన్ చేస్తోంది. తెలుగులో ఐపీఎల్ ప్ర‌సారాల‌కు ఎన్‌టీఆర్‌ను బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా తీసుకుంది. ఈ ఒప్పందం ద్వారా స్టార్ టీవీ, ఎన్‌టీఆర్‌ల బంధం మ‌రింత బ‌ల‌ప‌డ‌నుంది.« PREV
NEXT »

No comments

Post a Comment