తాజా వార్తలు

Thursday, 17 May 2018

బీజేపీ ఫైర్ బ్రాండ్ మళ్ళీ ఫైర్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుది కాంగ్రెస్ రక్తమని.. తొలి నుంచి ఆయన కాంగ్రెస్‌తో అంటకాగుతూనే ఉన్నారన్నారు. గతంలో వాజ్‌పేయ్ ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీకి మద్ధతు ఇవ్వకుండా.. కాంగ్రెస్ మద్ధతుతో దేవెగౌడను ప్రధానిని చేశారని విమర్శించారు.
ఇప్పుడు కూడా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని.. ఎన్నికల సమయంలో కూడా బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారని.. బీజేపీ గెలవడంతో ఓర్చుకోలేక.. కాంగ్రెస్-జేడీఎస్‌ల ప్రభుత్వం వచ్చేలా చూస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన చంద్రబాబుకు కర్ణాటక గవర్నర్‌ గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు. అసలు చంద్రబాబుకు ఏపీ పాలన పట్టుందా అని ప్రశ్నించారు.. ప్రభుత్వాన్ని గాడిలో పెట్టలేక.. పట్టు కోల్పోయాడు.. ప్రమాదాలు జరగుతుంటే సంతాపాలు, పరిహారాలు ఇవ్వడం తప్పించి శాశ్వత పరిష్కారానిక తీసుకుంటున్న చర్యలు ఏమీ లేవని విమర్శించారు
« PREV
NEXT »

No comments

Post a Comment