తాజా వార్తలు

Thursday, 17 May 2018

బాబుకు చెక్ పెట్టనున్న బీజేపీ నాయకుడు ఇతనేనా ?

కర్నాటకలో బీజేపీ గెలుపు ఏపీ లో ప్రకంపనలు సృష్టించింది. ఇక్కడ టీడీపీ – బీజేపీ నాయకులూ మాటలు తూటాలు పేలుస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకులూ అయితే ఒక అడుగు ముందుకు వేసి కర్నాటక గెలుపు చంద్రబాబు కి గుణపాఠం అంటూ విమర్శలు చేసారు. దింతో టీడీపీ నేతలు వాపును చూసి బలుపు అనుకోవద్దు అంటూ కౌంటర్ ఎటాక్ చేసారు.
ఇదే స‌మ‌యంలో బీజేపీకి వ్య‌తిరేకంగా గ‌ళం వినిపిస్తున్న ఆ పార్టీని ఎక్క‌డిక‌క్క‌డ ఓడించాలంటూ పిలుపునిస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు చెక్ పెట్టేలా బీజేపీ వ్యూహానికి ప‌దును పెంచుతోంది. ఈ క్ర‌మంలోనే ఆప‌రేష‌న్ ఏపీ పేరుతో పెద్ద ఎత్తున చంద్ర‌బాబుకు చెక్ పెట్టేలా వ్యూహం సిద్ధం చేస్తోంది. ఈ బీజేపీ ఆప‌రేష‌న్ ఏపీ కార్య‌క్ర‌మానికి కెప్టెన్‌గా బీజేపీ అధికార ప్ర‌తినిధి, ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ రాం మాధ‌వ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. తాజాగా ఆయ‌న చేసిన ట్వీట్ ఈ విష‌యాన్నే స్ప‌ష్టం చేస్తోంది. “కర్ణాటకలో విజయంతో దక్షిణాదిన మా దండయాత్ర మొదలైంది… ఏపీ సీఎం చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు” అంటూ ట్వీట్ చేశారు రామ్ మాధవ్.ముఖ్యంగా మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఏపీలో బీజేపీ హ‌వా ప్ర‌ద‌ర్శించేందుకు చేయాల్సిన అన్ని ప్ర‌య‌త్నాలూ చేయ‌నుంద‌న‌డానికి ఈ వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తున్నాయి. దీనిబట్టి చూస్తే 2019 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ మధ్య పెద్ద యుద్ధమే జరిగేలా కనిపిస్తుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment