తాజా వార్తలు

Thursday, 17 May 2018

పవన్ దూకుడు .. పాలకులపై ఆగ్రహం!

నిన్న చిత్తూరు జిల్లా శెట్టిపల్లిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఉత్తరాంద్ర పర్యటిస్తున్నారు. విశాఖ పట్టణం అంబేత్కర్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.కొంతమంది పాలకుల నిర్లక్ష్యానికి కోట్లాది మంది ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వెనుకబాటుతనం ప్రజలకేగాని నాయకులకు లేదని చెప్పుకొచ్చారు. ఉద్యమాలకు పుట్టినిల్లయిన శ్రీకాకుళం జిల్లా నుంచి తన బస్సు యాత్రను ప్రారంభిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఈ నెల 20న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఉత్తరాంధ్రలోనే దాదాపు 45 రోజులు ఈ యాత్ర కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
అలాగే సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాల తీరుకు నిరసనగా అన్ని నియోజక వర్గాల్లో నిరసన కవాతు నిర్వహిస్తామని పవన్ అన్నారు. మనకు రాజకీయ జవాబుదారీతనం ఉండే ప్రభుత్వాలు రావాలని, బీజేపీ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు.పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయని, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం బాధాకరమని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జనసేన ప్రభుత్వం వస్తే అన్ని జిల్లాల్లో అమరుల స్మారక చిహ్నాలు పెడతామని, 2019 ఎన్నికలే లక్ష్యంగా తాము పనిచేస్తామని పవన్ కల్యాణ్‌ తెలిపారు.

« PREV
NEXT »

No comments

Post a Comment