తాజా వార్తలు

Thursday, 17 May 2018

యడ్యూరప్ప అను నేను..ముఖ్యమంత్రిగా మూడోసారి..!

యడ్యూరప్ప అను  నేను..

కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బీఎస్‌ యడ్యూరప్ప గురువారం ప్రమాణం స్వీకరించారు. రాజ్‌భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో యడ్యూరప్పతో గవర్నర్‌ వజుభాయ్‌ వాలా ప్రమాణం చేయించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప పగ్గాలు చేపట్టడం ఇది మూడోసారి. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రకాశ్‌ జవదేకర్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. యెడ్డీ ప్రమాణం అనంతరం బీజేపీ కార్యకర్తలు శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై.. మోదీ, మోదీ అంటూ నినాదాలు చేశారు
« PREV
NEXT »

No comments

Post a Comment