తాజా వార్తలు

Thursday, 17 May 2018

‘రైతుబంధు’ పథకంలో చిన్న మార్పు..!

రైతుబంధు’ పథకంలో చిన్న మార్పు..!

‘రైతు బంధు’ పథకం అమలు విధివిధానాల్లో ప్రభుత్వం చిన్న మార్పు చేసింది. ఇప్పటివరకు పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకోని రైతులు చెక్కులను మార్చుకునే అవకాశం లేదు. అయితే ప్రభుత్వం చేసిన తాజా మార్పుతో పాస్ పుస్తకాలు లేని రైతులు కూడా చెక్కును నగదుగా మార్చుకునే అవకాశం కలిగింది. కాకపోతే చెక్కులు మార్చుకోడానికి సంబంధిత తహసీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘రైతుబంధు’ పథకం.. రాష్ట్ర వ్యాప్తంగా మే 10 నుంచి అమలవుతున్న సంగతి తెలిసిందే. ఎకరానికి రూ.8 వేల పంట పెట్టుబడి ప్రభుత్వం చెక్కుల రూపంలో పంపిణీచేస్తున్నది. ఇప్పటి వరకు దాదాపు 40 శాతం వరకు చెక్కుల పంపిణీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment