తాజా వార్తలు

Thursday, 17 May 2018

తమిళ దర్శకుడితో ఎన్టీఆర్.?

తమిళ దర్శకుడితో ఎన్టీఆర్.?

ఒకవైపు దర్శకుడు త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నాడు . ఇది పూర్తి కాగానే తదుపరి ప్రాజెక్ట్ కూడా రెడీగా ఉంది కోసం. అది ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందే సినిమా. అందులో రామ్ చరణ్‌తో కలిసి నటించబోతున్నాడు తారక్. ఇలా ఒక భారీ మల్టీస్టారర్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పిన తారక్ ఆపై ఒక తమిళ దర్శకుడితో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
తారక్‌తో సినిమా చేయబోయే తమిళ దర్శకుడు మరెవరో కాదు అట్లీ. అనువాద సినిమాలతో తెలుగువారికి సుపరిచితుడు ఈ దర్శకుడు. ‘రాజా రాణి’, ‘మెర్సల్’ వంటి సినిమాలతో సూపర్ హిట్స్‌ను కొట్టిన ఈ దర్శకుడు తెలుగులో సినిమా చేయడానికి చాన్నాళ్ల కిందట నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. తదుపరి తను ఒక తెలుగు సినిమా చేయబోతున్నట్టుగా ఇటీవలే ప్రకటించాడు కూడా.
దానిపై ఇప్పుడు మరింత స్పష్టత వచ్చింది. అట్లీ దర్శకత్వంలో నటించబోయే తెలుగు హీరో మరెవరో కాదు తారక్ అని తెలుస్తోంది. సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడని, కొంత విరామం తర్వాత దత్ ప్రొడ్యూసర్‌గా ఒక భారీ సినిమా రాబోతోందని సమాచారం. అన్నీ కుదిరితే 2019 ద్వితియార్థంలో ఈ సినిమా పట్టాలెక్కనుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment