తాజా వార్తలు

Thursday, 17 May 2018

మా నమ్మకాన్ని ప్రజలే వమ్ము చేసారు..

మా నమ్మకాన్ని ప్రజలే వమ్ము చేసారు..

పేదలు, దళితులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి కాంగ్రెస్‌ చేసిన కృషిని ఎవరూ పట్టించుకోలేదంటూ తాజా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన బుధవారం బెంగళూరులోని పీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశంలో తన బాధనంతా వెళ్లగక్కారు. ‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంపట్ల ఎంతో విశ్వాసంతో ఉన్నా. ప్రజల కోసం రూపొందించిన సంక్షేమ పథకాలను విస్మరించి కులాలు, జాతుల అంశానికే ప్రాధాన్యమిస్తూ జనం మమ్మల్ని ఓడించారు. మా ప్రణాళికను ప్రజలే మార్చేశారు’ అంటూ ఆవేదన చెందారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యాలను కాపాడాలంటే కాంగ్రెస్‌, దళ్‌ శాసనసభ్యులెవరూ భాజపాలోకి వెళ్లవద్దని పిలుపునిచ్చారు.
« PREV
NEXT »

No comments

Post a Comment