తాజా వార్తలు

Saturday, 19 May 2018

హైద‌రాబాద్‌కు జ‌గ‌న్ అత్య‌వ‌స‌ర ప్ర‌యాణం!

ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చేప‌డుతున్నారు. అయితే ఆయ‌న అనుకోకుండా ఇవాళ అత్య‌వ‌స‌రంగా హైద‌రాబాద్‌కు ప్ర‌యాణమ‌య్యారు. కార‌ణం ఏంటో తెలుసా?..దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అత్యంత స‌న్నిహితుడైన డీఏ సోమ‌యాజులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై హైద‌రాబాద్‌లోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న్ను ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌కు విరామం ప్ర‌క‌టించి ఈ రాత్రికి హైద‌రాబాద్ కు బ‌య‌లుదేరారు.
డీఏ సోమ‌యాజులు గ‌తంలో ఆర్థిక వేత్త‌గా ప‌నిచేశారు. ఆయ‌న ప‌నితీరుకు ముగ్ధుడైన వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న హ‌యాంలో కేవీపీ రామ‌చంద్రారావుతో పాటు సోమ‌యాజులును స‌ల‌హాదారుగా నియ‌మించారు. దీంతో మ‌హానేత‌కు త‌ల‌లో నాలుక‌గా సోమ‌యాజులు ప‌నిచేశారు. న‌మ్మ‌క‌మైన వ్య‌క్తిగా పేరు గాంచారు. వైఎస్ఆర్ మ‌ర‌ణాంత‌రం ఆయ‌న కుమారుడు వైఎస్ జ‌గ‌న్‌కు బాస‌ట‌గా నిలిచారు. వైఎస్ఆర్‌సీపీ ఆవిర్భావం సంద‌ర్భంగా విధాన‌ప‌ర‌మైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చి త‌న వంతు స‌హ‌కారం అందించారు. కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య‌మంత్రి కాగానే త‌న స‌ల‌హాదారు ప‌ద‌వికి రాజీనామా చేసి జ‌గ‌న్ వెంట న‌డిచారు.

సోమ‌యాజుల‌కు అన్ని పార్టీల నాయ‌కుల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. టీఆర్ఎస్‌లోని ప‌లువురు మంత్రుల‌కు, తెలుగు రాష్ట్రాల‌ కాంగ్రెస్ నేత‌ల‌కు ఈయ‌న స‌ల‌హాలు ఇచ్చేవారు. త‌న‌కు తోడుగా నిలిచిన పెద్ద‌మ‌నిషి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌టంతో వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌కు ఒక‌రోజు విరామం ప్ర‌క‌టించి ప‌రామ‌ర్శించేందుకు రావ‌డం గ‌మ‌నార్హం.« PREV
NEXT »

No comments

Post a Comment