తాజా వార్తలు

Thursday, 17 May 2018

యెడ్డీ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

కర్నాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసారు కానీ ఆయనకు మాత్రం మనశాంతి లేదు. చరిత్ర ఉనరావృతం అవుతుందేమో అని అయన భయం.. ఈ భయం ఆయనలోనే కాదు ఇటు బీజేపీ అగ్రనాయకులను కూడా వెంటాడుతుంది. ఆ చరిత్ర ఏంటి .. వాళ్లకు ఎందుకు భయం ?
ముచ్చటగా మూడోసారి నేడు యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఆయన రెండుసార్లు సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటికీ, ఆయన్ను దురదృష్టం వెన్నాడింది. తొలిసారి ఆయన సీఎం పదవి మూనాళ్ల ముచ్చటే కాగా, రెండోదఫా మూడేళ్లకే పరిమితం అయింది. ఇక ఈ దఫా మెజారిటీ లేకున్నా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతగా, ప్రస్తుతానికి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ,  ఏమవుతుందో అన్నఆందోళన బీజేపీ శ్రేణుల్లో నెలకొని ఉంది.
2007లో మద్దతిస్తామని చెప్పిన జేడీఎస్ హ్యాండివ్వడంతో, కేవలం ఎనిమిది రోజుల్లోనే యడ్యూరప్ప ప్రభుత్వం పడిపోయింది. ఆపై 2008లో యడ్యూరప్ప గద్దెనెక్కినా, అవినీతి కేసుల్లో కూరుకుపోవడంతో 3 సంవత్సరాల రెండు నెలల తరువాత ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆపై యడ్డీ జైలుకు కూడా వెళ్లారు. ఇక ముచ్చటగా మూడోసారి సంఖ్యాబలం లేకున్నా సీఎంగా పదవిని అలంకరించారు. ఈదఫా అయినా పూర్తి కాలం పాటు సీఎంగా సేవలందిస్తారో లేక దురదృష్టం వెంటాడుతుందో చూడాలి!
« PREV
NEXT »

No comments

Post a Comment