తాజా వార్తలు

Thursday, 17 May 2018

ఇక నేనేంటో చూపిస్తా!

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివెల్‌లో 15వ సారి పాల్గొన్న ఐశ్వర్య.. అక్కడ జరిగిన మీడియా చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నటన విషయంలో మరింత దూకుడుగా ముందుకెళ్తానని, ఇకపై తానేంటో చూపిస్తానని తెలిపింది. గతంలో స్కూలు పిల్లలా వ్యవహరించి చాలా తప్పులు చేశానని చెప్పింది. పెద్దపెద్ద సినిమాల్లో వచ్చిన అవకాశాలను చేజేతులా వదులుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. కావాలని అలా చేయలేదని.. షెడ్యూల్ విషయంలో పక్కాగా ఉండటం వల్లే వాటిని వదులుకోవాల్సి వచ్చిందని తెలిపింది.
అయితే, ఇకపై అలా ఉండదలచుకోలేదని.. సినిమాలు, పాత్రల విషయంలో మరింత దూకుడుగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నానని ఐశ్వర్యరాయ్ తెలిపింది. అందుకు అనుగుణంగా షెడ్యూళ్లను మలచుకుంటానని అన్నారు. తన తోటి నటులందరూ సినిమాలతో బిజీగా ఉండటం గమనిస్తున్నానని.. ఇకపై తాను కూడా సినిమాల విషయంలో మరింత దూకుడుగా ముందుకెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. ఐశ్వర్యరాయ్ ఈ ఏడాది జాస్మిన్, వో కౌన్ థీ, రాత్ ఔర్ దిన్ చిత్రాల్లో నటించనున్న సంగతి తెలిసిందే.
« PREV
NEXT »

No comments

Post a Comment