తాజా వార్తలు

Thursday, 17 May 2018

‘రంగస్థలం’లో ‘సైరా’

‘రంగస్థలం’లో ‘సైరా’

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ‘రంగస్థలం’ కోసం హైదరాబాద్‌ శివార్లలో ఓ పల్లెటూరుని సృష్టించారు. 1985 నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఆ సెట్‌ని రూపొందించారు. ఇప్పుడు అదే సెట్లో ‘సైరా’ అడుగుపెట్టాడు. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి  దర్శకుడు. ఇది కూడా చారిత్రక గాథే. అందుకే ‘రంగస్థలం’ సెట్‌లో కొద్ది మార్పులు చేసి ‘సైరా’ కోసం వాడుకుంటున్నారు. ప్రస్తుతం ‘రంగస్థలం’ సెట్లోనే ‘సైరా’కి సంబంధించిన కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. పది రోజుల పాటు ఈ షెడ్యూల్‌ కొనసాగుతోంది. చిరంజీవితో పాటు ఇతర ప్రధాన తారాగణం మొత్తం ఈ షూటింగ్‌లో పాలుపంచుకుంటోంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment