తాజా వార్తలు

Thursday, 17 May 2018

ఈ పోషకాలు అందుతున్నాయా.!

ఈ పోషకాలు అందుతున్నాయా.!

గర్భిణీగా ఉన్నప్పుడు పోషకాహారం తీసుకునే మహిళలు ప్రసవానంతరం పాపాయి సంరక్షణలో పడి, తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇంకొందరైతే, డైటింగ్‌ పేరుతో ప్రయోగాలు మొదలుపెడతారు. కానీ అప్పుడూ పోషకాహారానికే ప్రాధాన్యం ఇవ్వాలి.
బాలింతలకు మాంసకృత్తులూ, విటమిన్లూ, ఖనిజాలు అవసరం. ఇవి సమానంగా అందితే తల్లిబిడ్డా ఆరోగ్యంగా ఉంటారు.
ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలుండే సాల్మన్‌, ట్యూనా చేపలూ, చికెన్‌, బీన్స్‌, చిక్కుడు జాతి గింజలు తీసుకోవాలి. అలాగే ఇనుము, కాల్షియం, పీచూ, సంక్లిష్ట పిండి పదార్థాలు అందేలా చూసుకోవాలి. 
పాపాయికి పాలు పడుతున్నప్పుడు తల్లికి విటమిన్‌ సి తప్పనిసరి. నారింజ, నిమ్మ, బత్తాయి వంటి నిమ్మజాతి పండ్లు తీసుకోవాలి.
గుడ్డు పచ్చసొనలో డి విటమిన్‌ ఉంటుంది. భోజనంలో దీనిని తీసుకుంటే డి విటమిన్‌తోపాటూ శరీరానికి కావాల్సిన మాంసకృత్తులు కూడా అందుతాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment