తాజా వార్తలు

Thursday, 17 May 2018

ఒత్తిడికి కారణాలెన్నో..

ఒత్తిడికి కారణాలెన్నో..

ఇంట్లో చోటుచేసుకునే చిన్నచిన్న సందర్భాలు కూడా తెలియని ఒత్తిడికి దారితీస్తాయి. అయితే ఇవన్నీ పైకి కనిపించని కారణాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుని, వాటిని ఎలా అధిగమించాలో చూద్దాం.
సామాజిక మాధ్యమాలు కూడా తెలియని ఒత్తిడిని కలిగిస్తాయి. స్నేహితులతో మాట్లాడేందుకు ఇదో వేదిక కావచ్చు, కానీ అదేపనిగా దానికి సమయం కేటాయించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే అవసరానికి మించి ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల జోలికి వెళ్లకూడదు. ఆ సమయాన్ని మీ కోసం వినియోగించుకుంటే ఒత్తిడికి లోనుకాకుండా ఉండవచ్చంటున్నారు.
కొందరు ఒకేసారి ఎక్కువ పనులు చేసేస్తుంటారు. అది సామర్థ్యం అనుకోవడం మంచిదే. అయితే అది కూడా తెలియకుండా ఒత్తిడికి దారితీస్తుంది. అందుకే ఒకసారి ఒక పనిని మాత్రమే చేసేలా చూసుకోవాలి. దానికో ప్రణాళిక పెట్టుకోవాలి.
సమయం పాటించలేనప్పుడు కూడా ఒత్తిడికి లోనవుతారు. కార్యాలయానికో, మరోచోటికో వెళ్లేటప్పుడు ఏ మాత్రం ఆలస్యమైనా ఒత్తిడీ, కంగారు తప్పదు. అందుకే ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు ఓ పదినిమిషాలు ముందే బయలుదేరేలా చూసుకోవాలి. ఆ ప్రకారం మిగిలిన పనుల్ని పూర్తిచేసుకోవాలి.
« PREV
NEXT »

No comments

Post a Comment