తాజా వార్తలు

Thursday, 17 May 2018

బాదాం తినండి.. బరువు తగ్గండి..

బాదాం తినండి బరువు తగ్గండి..

బాదం పప్పు తింటే బరువు తగ్గడానికి తన వంత సాయం చేస్తుంది. రాత్రి పూట గుప్పెడు బాదం పప్పులు నీళ్లలో నాన బెట్టుకోండి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదాన్ని తినండి. పొట్టు తీసేసి తింటే మంచిది. దీని వల్ల కడుపు నిండిన భావన వస్తుంది. కనుక మీకు తెలియకుండానే ఆహారం తక్కువ తీసుకుంటారు. కనుక అదనపు కొవ్వు చేరదు. సరికదా ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. బాదంలో ఉండే పీచు, మెగ్నీషియం, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, మాంసకృత్తులు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. బరువు తగ్గాలని కోరుకుంటున్న వారికి బాదం పప్పు మంచి పోషకాహారమని చెప్పుకోవచ్చు.
బాదంపప్పులో ఇంకా చాలా మంచి గుణాలు ఉన్నాయి. గుండు జబ్బుల్ని దరి చేరనివ్వదు. చెడు కొలెస్ట్రాల్ వల్ల వచ్చే సమస్యల్ని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది కాబట్టి బీపీ ఉన్న వారు బాదం రోజూ తింటే మంచిది. అంతేకాదు చర్మాన్ని కాంతివంతంగా చేసి త్వరగా ముడతలు రాకుండా చూస్తుంది. ఇక ఇందులో ఫోలిక్ యాసిడ్ బాగా ఉంటుంది కాబట్టి… కాబోయే తల్లులు తీసుకుంటే కడుపులోని బిడ్డలకు మరీ మంచింది.
« PREV
NEXT »

No comments

Post a Comment