తాజా వార్తలు

Thursday, 8 November 2018

నేను చూసుకుంటా.. సీట్లు అడగకండి!ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో గురువారం తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. తెలంగాణలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై వారు చర్చించారు. ఈ సందర్భంగా మనకు తెలంగాణలో సీట్లు ముఖ్యం కాదని, టీఆర్ఎస్ ఓటమి ముఖ్యమని ఆయన మరోసారి తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఎక్కువ సీట్లలో పోటీ చేయడం మన లక్ష్యం కాదని, ఇచ్చిన సీట్లలో గెలవడం ముఖ్యమని, అదే విధంగా టీఆర్ఎస్ ఓటమి ముఖ్యమని చెప్పారని తెలుస్తోంది. మనకు కాంగ్రెస్ ఇచ్చిన స్థానాలు తీసుకోవాలని, మిగతా చోట్ల అసంతృప్తులు ఉంటే తాను స్వయంగా మాట్లాడుతానని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది. కానీ మనకు సీట్ల సంఖ్య మాత్రం ముఖ్యం కాదని చెప్పారు. గతంలోను ఇదే విషయాన్ని చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment