తాజా వార్తలు

Thursday, 8 November 2018

చంద్రబాబుతో కేసీఆర్ అన్న కూతురు మంతనాలు!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అన్న కూతురు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల రమ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఉండవల్లిలోని ఏపీసచివాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె టిక్కెట్ కోసం ఆయనతో చర్చించి ఉంటారని భావిస్తున్నారు.
చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన సమయంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి తదితరులు ఆయనను టిక్కెట్ల అంశంపై కలిశారు. రాజేంద్రనగర్ నుంచి పోటీ చేయాలనుకుంటున్న కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కూడా ఢిల్లీలో ఆయనను టిక్కెట్ కోసం కలిశారు. ఇప్పుడు రమ్య కలిశారు.
ఇదిలా ఉండగా, ఇటీవల రమ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. తనకు స్ఫూర్తి చంద్రబాబు అని చెప్పారు. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ అని, మంచి స్ట్రాటజీ కలిగిన వ్యక్తి అని, మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకుడు అని, ఆయన తన కోసం కాకుండా విజన్‌తో కలిసి పని చేస్తారని, ఇప్పుడు తనకు నష్టం జరిగినా పర్వాలేదు.. భవిష్యత్తులో ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటారని, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అని చెప్పారు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిగా చంద్రబాబును తాను గౌరవిస్తానని, అభిమానమని రమ్య చెప్పారు.
కేసీఆర్ అన్న కూతురుగా తాను చంద్రబాబు వద్ద పని చేస్తే ప్రజల్లోకి తప్పుడు సందేశాలు వెళ్తాయని ఊరుకున్నానని, కానీ ఓ మంచి నాయకుడి కింద పని చేసే అవకాశం కోల్పోయాననే బాధ ఎప్పటికీ ఉంటుందన్నారు. చంద్రబాబు చాలా సిన్సియర్‌గా ప్రజల కోసం పని చేస్తారని రమ్య చెప్పారు. తన పార్టీ అధికారంలో ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదని, కానీ ఆయన ప్రజల కోసం పని చేయాలనుకుంటారని, తాను అతనిని కొన్నిసార్లు కలిశానని చెప్పారు. ఆయన అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తి అన్నారు. పార్టీలు వేరైనా ఆయన రాజకీయంగా ఆయన వ్యక్తిత్వం గొప్పదన్నారు. విభజన అనంతరం చంద్రబాబు మనోధైర్యంతో మాట్లాడారని, తెలంగాణ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని, అదే సమయంలో ఏపీకి న్యాయం చేయాలని మనోధైర్యంతో చెప్పారన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment