Writen by
vaartha visheshalu
03:44
-
0
Comments
డిసెంబర్ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై గెలిచి తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతానని కాంగ్రెస్ పార్టీ గజ్వెల్ నియోజకవర్గం నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పైన తనకు చాలా గౌరవం ఉందని, అయితే ఆయన పరిపాలనే అధ్వాన్నంగా ఉందని చెప్పారు.
కేసీఆర్, హరీష్ రావులపై తనకు వ్యక్తిగత కక్ష ఏమీ లేదని వంటేరు చెప్పారు. తాను ఎప్పుడు కూడా పేదల పక్షాన్నే ఉంటానని చెప్పారు. వారికి న్యాయం చేయడమే తన అభిమతమని అన్నారు. తాను నిత్యం నియోజకవర్గంలోనే ఉంటున్నానని, ప్రజలు తనను గెలిపిస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. గజ్వెల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బిర్యానీ, బీరు పంపిణీ చేస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలన్నారు.
No comments
Post a Comment